ఎక్కడ ఒక్క అబార్షన్ కూడా కావొద్దు

స్కానింగ్ సెంటర్లలో ఎక్కడైనా అబార్షన్ జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరికలు జారీ చేశారు.

Update: 2025-03-26 14:54 GMT
ఎక్కడ ఒక్క అబార్షన్ కూడా కావొద్దు
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి అర్బన్ : స్కానింగ్ సెంటర్లలో ఎక్కడైనా అబార్షన్ జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్, న్యాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఛాంబర్ లో ఆమె ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ప్రతి ఒక్క హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ ను ప్రతినెల క్రమం తప్పకుండా విజిట్ చేసి హాస్పిటల్లో రేట్స్ తప్పక డిస్ప్లే చేసేలా చూడాలన్నారు. అవేర్నెసి ప్రోగ్రామ్స్ ద్వారా స్కూళ్లలో కాలేజీలలో ఈ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రికి సంబంధించిన సెక్స్ రేషియో లిస్ట్ ను తయారు చేయాలని, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో సక్రమంగా లేని హాస్పిటల్ లను సీజ్ చేసి కేసులు బుక్ చేయాలని సూచించారు. ఎమ్మన్నార్ ఆసుపత్రి వారు రాష్ట్ర టీం పరిశీలనలో రికార్డులు సరిగా లేవని తెలియడంతో వారికి నోటీసు ఇవ్వడం జరిగిందనీ వారికి 50 వేల ఫైన్ కమిటీ తరపున వేయడం జరిగిందని డిఎం అండ్ హెచ్ ఓ గాయత్రీ దేవి కలెక్టర్ కు వివరించారు.

ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో ఎట్టి పరిస్థితులను మైనర్, ఇతరులకు అబార్షన్ చేయొద్దని ,ఒకవేళ చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలని ఆదేశించారు. మొదటి సారి గర్భం ధరించిన గర్భవతులకు అత్యవసరమైతే తప్ప సీ సెక్షన్స్ ద్వారా ప్రసవాలు జరుపకూడదని తెలిపినారు. అనంతరం సీనియర్ న్యాయమూర్తి రమేష్ మాట్లాడుతూ.. డికాయ్ ఆపరేషన్ ప్రతి స్కానింగ్ సెంటర్లో తప్పక జరపాలని, నారాయణఖేడ్, పటాన్ చెరు ఏరియాలలో అబార్షన్ చేయకుండా చూడాలని కోరారు. అడిషనల్ ఎస్పీ సంజీవరావు మాట్లాడుతూ డేకాయ్ ఆపరేషన్ కు పోలీస్ వారి సహకారం తప్పక ఉంటుందని, అనుమతులు లేకుండా స్కానింగ్ గాని, హాస్పిటల్ నడిపే వారిని అబార్షన్ చేసే వారిని వైద్య ఆరోగ్యశాఖ తరపున గుర్తించి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వనజ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి, పిఓఎంసిహెచ్ డాక్టర్ నాగ నిర్మల, ఎం.ప్రసాద్, రవి, శశి, పల్లవి ఇతర ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News