50 శాతం రాయితీపై మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. కోటి 69 వేలతో 459 యూనిట్లు సిద్దిపేట జిల్లా పరిధిలో రాయితీ పై అందించనున్నారు. బ్యాటరీ స్ప్రేయర్లు 125, తైవాన్ స్ప్రేయర్లు 126, డ్రోన్ 1, రోటో వీటర్లు 70, విత్తనము ఎరువులు వేసే యంత్రాలు 15, కల్టివేటర్, ఎంబీ ప్లవ్, కేజీవీల్ లు 88, బండ్ ఫార్మర్ 5, పవర్ వీడర్లు 5, బుష్ కటర్లు 6, పవర్ టిట్లర్లు 4, టాక్టర్లు 3, మెజ్ షెల్లర్లు 2, వరి గడ్డి కట్టలు కట్టే యంత్రాలు 3 పరికారాలు జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందించనున్నారు. ఈ రాయితీని పొందేందుకు మహిళల పేరు మీద భూమి నమోదై ఉండాలి. భూమి పాస్ బుక్, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్ సీ ( ట్రాక్టర్ సంబంధిత పనిముట్లకు మాత్రమే) దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మరిన్ని వివరాల కోసం మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల మహిళా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.