గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది.

దిశ, జిన్నారం: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిన్నారం మండలంలోని గడ్డపోతారం మున్సిపల్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గడ్డపోతారం మున్సిపల్ శివారులోని ప్రధాన రహదారి పక్కన ఒక వ్యక్తికి తీవ్ర గాయాలై రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. మృతి చెందిన వ్యక్తి కి 43 ఏళ్ల వరకు వయస్సు ఉంటుందని, ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తమకు తెలియజేయాలని సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్టు సీఐ వెల్లడించారు