ప్రియుడితో కలిసి భర్తను చంపాలనుకున్న భార్య కుట్ర భగ్నం

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య యత్నం చేసిన సంఘటన మండలంలోని పెద్ద గోపులారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.

Update: 2025-03-23 16:18 GMT
ప్రియుడితో కలిసి భర్తను చంపాలనుకున్న భార్య కుట్ర భగ్నం
  • whatsapp icon

దిశ, మునిపల్లి : ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య యత్నం చేసిన సంఘటన మండలంలోని పెద్ద గోపులారం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. ఆదివారం మండలంలోని బుదేరా పోలీస్ స్టేషన్ లో స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండాపూర్ సీఐ వెంకటేశం మాట్లాడుతూ.. మండలంలోని పెద్ద గోపులారం గ్రామానికి చెందిన కొంషేడ్పల్లి రవి( పంచాయతీ కార్యదర్శి) శనివారం జహీరాబాద్ వైపు నుంచి సొంత ఊరైన పెద్ద గోపులారం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. జహీరాబాద్ నుంచి రవి భార్య హరిత ప్రియుడు తన స్నేహితులతో కలిసి తార్ వాహనంతో ఫాలో అయి.. మునిపల్లి మండలంలోని పెద్ద గోపులారం శివారులో రవి తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాన్ని నిలుపుకొని మాట్లాడుతుండగా తార్ వాహనంతో అతివేగంగా ఢీ కొట్టాడు. దీంతో రవి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు సీఐ తెలిపారు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటపడింది. అక్రమ సంబంధానికి భర్త రవి అడ్డుగా ఉన్నాడని భార్య హరితనే తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర చేసిందని హరిత ప్రియుడు, పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు ప్రయత్నం చేసిన భార్య హరిత, ఆమె ప్రియుడుతో పాటు మరో వ్యక్తి 1. మిడిదొడ్డి సాయి 2. దాసోజి సాయికిరణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్న మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్, బుదేరా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాండు, తుకారం, అనీఫ్, సునీల్ లను కొండాపూర్ సీఐ అభినందించారు.


Similar News