భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం.. అర్ధరాత్రి ఆటోలో వెళ్తుండగా వెంబడించి మరి..
అర్ధరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యభర్తలను వెంబడించి.. భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : అర్ధరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్న భార్యభర్తలను వెంబడించి.. భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. భార్య ఎదుటే భర్తపై దాడి చేసి ఆపై ఆమెను రోడ్డు పక్కకు లాక్కెళ్లి దారుణంగా లైంగిక దాడి చేసి పారిపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి రూరల్ సీఐ క్రాంతి కుమార్ వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
భర్త పై దాడి.. ఆపై లైంగిక దాడి
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలానికి చెందిన ఓ వివాహిత (30) ఓ పని నిమిత్తం తన భర్తతో కలిసి సోమవారం కంది మండలానికి సొంత ఆటోలో వెళ్లారు. ఇక్కడ పని కాకపోవడంతో తిరిగి కంది మండలం మామిడిపల్లి చౌరస్తా మీదుగా తమ గ్రామానికి తిరిగి ప్రయాణమయ్యారు. సరిగ్గా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆటో నడిపిస్తున్న భర్త మామిడిపల్లి బ్రిడ్జ్ బైపాస్ రోడ్డు పక్కన కాళ్లకృత్యానికి వెళ్ళాడు. అప్పటికే స్కూటీపై ఇద్దరు యువకులు వీరి ఆటోని వెంబడిస్తూ అక్కడికి వచ్చారు. మహిళ ఒంటరిగా ఆటోలో కనిపించడంతో స్కూటీ పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే భర్త అక్కడికి రావడంతో ఆయనపై దాడి చేసి ఆటోలో ఉన్న ఆమెను పక్కనే ఉన్న ఓ నిర్మానుష్య వెంచర్‌లోకి తీసుకెళ్లి ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారీ అయ్యారు. కామాంధుల దాడితో బాధితురాలి భర్త కంటికింద గాయాలయ్యాయి. మంగళవారం భార్యాభర్తలు సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. లైంగికదాడికి పాల్పడిన ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పంకాజ్ మంగళవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.