పెద్ద శంకరంపేట లో ఓ మోస్తరు వర్షం...

పెద్ద శంకరంపేటలో శుక్రవారం సాయంత్రం దాదాపు 20 నిమిషాల పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది.

Update: 2025-03-21 12:11 GMT
పెద్ద శంకరంపేట లో ఓ మోస్తరు వర్షం...
  • whatsapp icon

దిశ, పెద్ద శంకరంపేట్; పెద్ద శంకరంపేటలో శుక్రవారం సాయంత్రం దాదాపు 20 నిమిషాల పాటు ఓ మోస్తారు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ ఎక్కువగా ఉండటంతో ఎండ వేడిమికి గురైన ప్రజలు సాయంకాల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వాతావరణం చల్లబడటం తో పాటు దాదాపు 20 నిమిషాల పాటు ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. పెద్ద శంకరంపేట లోని పాత గ్రామ పంచాయతీ వార్డులో మురికి నీరు రహదారిపై పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగిందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.


Similar News