డంపింగ్ యార్డ్ వద్దే వద్దు.. ఓటింగ్ లో ప్రజల తీర్పు

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారా నగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత నమోదవుతుంది

Update: 2025-03-21 12:48 GMT
డంపింగ్ యార్డ్ వద్దే వద్దు.. ఓటింగ్ లో ప్రజల తీర్పు
  • whatsapp icon

దిశ, గుమ్మడిదల : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారా నగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై ప్రజల తీవ్ర వ్యతిరేకత నమోదవుతుంది. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని నిరసిస్తూ 45 రోజులుగా నిరంతర నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మండల జేఏసీ ప్రజా పోరాటాల సంఘం ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించగా, మొత్తం 6,449 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటింగ్‌లో 6,430 మంది డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కేవలం ఒకే ఒక్క ఓటు మాత్రమే అనుకూలంగా నమోదవగా, 18 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవించాలి

ప్రజలు తేల్చిచెప్పిన తీర్పు స్పష్టంగా ఉండటంతో ప్రభుత్వం ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని హాని చేసే ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి, డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి అని మండల ప్రజలు, రైతులు, వివిధ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News