మైనర్ బాలికపై లైంగిక దాడి.. దుండగుడి పై కేసు నమోదు

మానసిక స్థితి సరిగా లేని ఓ మైనర్ బాలికపై నలభయ్యేళ్ళ దుండగుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ములుగు మండల పరిధిలో గురువారం చోటుచేసుకుందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు.

Update: 2025-03-20 15:48 GMT
మైనర్ బాలికపై లైంగిక దాడి.. దుండగుడి పై కేసు నమోదు
  • whatsapp icon

దిశ, ములుగు : మానసిక స్థితి సరిగా లేని ఓ మైనర్ బాలికపై నలభయ్యేళ్ళ దుండగుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ములుగు మండల పరిధిలో గురువారం చోటుచేసుకుందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం...ములుగు మండల పరిధిలోని భైలంపూర్ గ్రామానికి చెందిన పెంటమీది స్వామి(40) మండల పరిధిలోని ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతుండగా అది గ్రహించిన స్థానికులు సదరు దుండగుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా నిందితుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.


Similar News