బైపాస్ రోడ్డులో ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
జహీరాబాద్ పట్టణ పరిధిలో బైపాస్ రోడ్డులో కారు డివైడర్ ను బలంగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ పరిధిలో బైపాస్ రోడ్డులో కారు డివైడర్ ను బలంగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గరలో ప్రమాద వశాత్తూ ఫ్లైఓవర్ పై జరిగిన ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాజా పరీదుద్దీన్ మృతిచెందగా అతని స్నేహితులు అలీముద్దీన్, నాసిర్, ముదాసిర్ రజువుద్దీన్ లు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మృతుడు ఫరీదుద్దీన్ తన స్నేహితులు అలీముద్దీన్, నాసిర్, ముదాసిర్ రజువుద్దీన్ లతో కలిసి రంజాన్ షాపింగ్ కోసం ముంబై వెళ్లి తిరిగి ఎర్టిగా కార్ లో వస్తుండగా మార్గమధ్యంలో పాత ఆర్టిఓ చెక్ పోస్ట్ సమీపంలో ఫ్లై ఓవర్ పై డివైడర్ కు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న కాజా ఫరీదుద్దీన్ జహీరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడ్డ ముగ్గురు క్షేత్రగ్రహతులను స్థానిక ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. మృతుడి బావ అబ్దుల్ వయిద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. కాశీనాథ్ తెలిపారు.