ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.. టెన్త్ విద్యార్థులకు హరీష్ రావు విషెస్
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. “భవిష్యత్ కు పునాది ఐదో తరగతి... ఇష్టపడి… ఆత్మవిశ్వాసం తో పరీక్షలు రాయండి…” ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గం 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ అమ్మానాన్నల ఆశయాలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఉత్తీర్ణత లోనూ, ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించడంలో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకొని ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని హరీష్ రావు శుభాశీస్సులు తెలిపారు.