ఈ నెల 22 నుంచి దేహ దారుడ్య పరీక్షలు.. సీపీ శ్వేత

ఈ నెల 22 నుంచి పోలీస్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు.

Update: 2022-12-17 11:57 GMT

దిశ, సిద్ధిపేట ప్రతినిధి: పోలీస్ నియమాక ప్రక్రియ లో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్వేత తెలిపారు. ఈమేరకు శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లను సీపీ పరిశీలించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... జిల్లాలో శరీరక దారుఢ్య పరీక్షలకు 9,983 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. ఇందులో 8013 మంది పురుషులు, 1970 మంది మహిళ అభ్యర్థులు ఉన్నారన్నారు. అవకతవకల కు తావు లేకుండా పక్బందీగా నిర్వహించేందకు గ్రౌండ్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పరుగెత్తె సమయంలో అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడీ ప్యాడ్ ను తగిలించడం జరుగుతుందన్నారు.

పురుష అభ్యర్తులు 16 వందల మీటర్లు, మహిళా అభ్యర్థులు 8 వందల మీటర్లు పరుగు వివరాలు అటోమెటిక్ గా రికార్డు అవుతాయని పేర్కొన్నారు. షాట్ పుట్, లాంగ్ జంప్ కోసం డిజిటల్ థియోడలైట్స్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేహ దారుడ్య పరీక్షల వివరాలు ఆన్ లైన్ లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి బోర్డ్ సర్వర్ లో అప్ లోడ్ అవుతాయని తెలిపారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రామకృష్ణ, ఎస్బీ ఇన్స్ పెక్టర్ రఘుపతి రెడ్డి, కమ్యూనికేషన్ఇన్స్ పెక్టర్ ప్రవీణ్, ఆర్ఎస్ఐలు తిరుపతి, వెంకటరమణ, నిరంజన్, రంజిత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు 7 మార్కులు కలపాల్సిందే

Tags:    

Similar News