దారుణం.. అదనపు కట్నం కోసం ఏం చేశారో చూడండి!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Update: 2025-03-17 16:30 GMT
దారుణం.. అదనపు కట్నం కోసం ఏం చేశారో చూడండి!
  • whatsapp icon

దిశ , కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం నాగన్‌పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త, మామ, బావ వేధింపులు భరించలేక గృహిణి పొగుల మహేశ్వరి (22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగన్‌పల్లి గ్రామానికి చెందిన పొగుల మహేశ్వరి, భీంరా గ్రామానికి చెందిన బొండ్ల పండరీ రెడ్డితో 2022లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త పండరీ రెడ్డి, మామ గంగారెడ్డి, బావ బషిరెడ్డి అదనపు కట్నం కోసం మహేశ్వరిని వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా వేధింపులు ఆగకపోవడంతో.. ఈరోజు ఉదయం 6:00 గంటల సమయంలో మహేశ్వరి తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేయగా..దర్యాప్తు బాధ్యతను డిఎస్పి నారాయణఖేడ్ తీసుకున్నారు. కంగ్టి ఎమ్మార్వో ఆధ్వర్యంలో డిఎస్పి మృతదేహంపై శవపరీక్ష నిర్వహించి, పిఎంపి కోసం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.


Similar News