నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం
సిద్దిపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి పూజల హరి కృష్ణ అన్నారు.

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి పూజల హరి కృష్ణ అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండవెల్లి, రాఘవ పూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూజల హరి కృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సబ్బండ వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం అంజి రెడ్డి, రాములు, డీసీసీ మహిళా అధ్యక్షులు ముద్దం లక్ష్మి, గ్రామ శాఖ అధ్యక్షుడు పద్మారెడ్డి, రాములు, మహిపాల్ రెడ్డి, బండి శివ, రమేశ్, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాధవరెడ్డి, ఎల్లారెడ్డి, నరసింహారెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బాలా గౌడ్, వెంకట్ రెడ్డి, రాజు, సురేష్ కుమార్, రామ్ రెడ్డి, శ్రీనివాస్, నితిన్ రెడ్డి, కిషన్ తదితరులు పాల్గొన్నారు.