గంజాయి కలిగి ఉన్న వ్యక్తుల అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి సీజ్ చేసిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

దిశ, సిద్దిపేట అర్బన్ : ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి సీజ్ చేసిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రంగధాంపల్లి నుంచి పొన్నాల కు వెళ్లే మార్గం కడారి ప్రశాంత్, పుట్ల వికాస్ వద్ద 786 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రెండు మొబైల్స్, ద్విచక్ర వాహనం సీజ్ చేశారు. ఇరువురిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచ గా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్ హెచ్ వో శ్రీనివాస్, డీటీఎఫ్ సీఐ శ్రీధర్ తెలిపారు.