ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ నెల 31 వరకు దరఖాస్తుల గడువు
దూరవిద్య ద్వారా పలు కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.బి. రెడ్డి తెలిపారు.

దిశ, సికింద్రాబాద్: దూరవిద్య ద్వారా పలు కోర్సుల్లో చేరే విద్యార్థులు ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.బి. రెడ్డి తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఐసెట్ లో అర్హత సాధించని విద్యార్థులు ఓయూ దూరవిద్య కేంద్రంలో ఈ నెల 28 న నిర్వహించే ప్రవేశ పరీక్ష కు హాజరు కావాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష కోసం 28వ తేదీ ఉదయం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఐసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఇతర కోర్సుల్లో నేరుగా దూరవిద్యలో చేరవచ్చని తెలిపారు. కోర్సుల వివరాల కోసం ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రం వెబ్ సైట్ www.oucde.net ను సందర్శించవచ్చని ఆయన సూచించారు.