వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

వేరు వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు.

Update: 2025-03-17 15:54 GMT
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి
  • whatsapp icon

దిశ, సంగారెడ్డి అర్బన్ : వేరు వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... కంది మండలం చిమ్మాపూర్ తండాకు చెందిన అమర్ సింగ్ (25) స్థానికంగా ఏ పని చేయకుండా మద్యానికి బానిసై ఖాళీగా తిరుగుతున్నాడు. గతంలో ఇతడు తన మొదటి భార్యను చంపి జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఇతడికి మరొకరితో రెండో వివాహం జరిగింది. కాగా ఈ నెల 17న మనస్థాపంతో చిమ్నాపూర్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫసల్వాదికి చెందిన మరో వ్యక్తి మృతి

ఫసల్వాది గ్రామానికి చెందిన బైండ్ల యాదయ్య (50) ఈ నెల 17న చేపలు పట్టేందుకు పసల్వాది పాత బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అయితే చేపలు పడుతుండగా ..ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ నీటిలో పడి మృతి చెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


Similar News