కడగండ్ల వాన మూలంగా రైతులకు తీవ్ర నష్టం : మంత్రి హరీష్ రావు.

మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను దుబ్బాక మండల పరిధిలోని అప్పన్నపల్లి, పెద్దగుండవెళ్లి, దుంపలపల్లి, పోతారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, తిమ్మాపూర్, పద్మనాభం పల్లి, అక్బర్ పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్, ఎనగుర్తి, మిరుదోడ్డి మండలంలోని కొండాపూర్, అందే, వరదరాజు పల్లి, గోవర్ధనగిరి, గుడికందుల, గ్రామాల్లో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

Update: 2023-04-26 12:29 GMT

దిశ, దుబ్బాక: మంగళవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను దుబ్బాక మండల పరిధిలోని అప్పన్నపల్లి, పెద్దగుండవెళ్లి, దుంపలపల్లి, పోతారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, తిమ్మాపూర్, పద్మనాభం పల్లి, అక్బర్ పేట భూంపల్లి మండలంలోని బొప్పాపూర్, ఎనగుర్తి, మిరుదోడ్డి మండలంలోని కొండాపూర్, అందే, వరదరాజు పల్లి, గోవర్ధనగిరి, గుడికందుల, గ్రామాల్లో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

రైతులతో మాట్లాడుతూ మంత్రి మాట్లాడుతూ.. రైతులు ధైర్యంగా ఉండి ఆత్మ విశ్వాసం కోల్పోవద్దు. రైతుల పక్షపాతి అయిన నాయకుడు కేసీఆర్ ఉన్నారు. కాబట్టి ఎవరూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు రైతులను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. నోటి కాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఎంపీ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి తో సాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యంతో పంట దిగుబడి భారీగా పెరిగిందన్నారు. ఇదే సమయంలో వడగళ్లు కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం ప్రకటించారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంతో కలిసి ఎకరా పంట నష్టంకు రూ.10 వేలు అందించి అదుకోవాలన్నారు. ఫసల్ బీమా నిరుపయోగంగా మారిందన్నారు.

రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువొచ్చి వందలాది మంది రైతుల ఉసురు తీసిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నమిలే భాస్కర్ చారి, పీఏసీఎస్ చైర్మన్ శైర్ల కైలాసం, మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల జ్యోతి కృష్ణ, తోగుట మండలం అధ్యక్షుడు జిడిపల్లి రాంరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News