సంగారెడ్డి రూరల్ ఎస్సైగా రవీందర్
సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పీ.రవీందర్ బాధ్యతలు తీసుకున్నారు.
దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పీ.రవీందర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహించిన విద్యా చరణ్ రెడ్డి వి.ఆర్ కు బదిలీ అయ్యారు. గతంలో సూర్యాపేట ఎస్సైగా పనిచేస్తూ, సంగారెడ్డి విఆర్ లో విధులు నిర్వహిస్తున్న రవీందర్ నూతన ఎస్సైగా బదిలీపై ఇక్కడికి వచ్చారు. కేవలం నెలల వ్యవధిలోనే ఎస్సై బదిలీపై వెళ్లడం తో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.