ఆక్రమించిన రేకుల షెడ్లను తొలగించిన అటవీ శాఖ అధికారులు..

హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామంలోని శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం వద్ద అటవీ భూమిని ఆక్రమించి రేకుల షెడ్లను నిర్మించారని,

Update: 2025-01-09 13:01 GMT

దిశ, హత్నూర : హత్నూర మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామంలోని శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయం వద్ద అటవీ భూమిని ఆక్రమించి రేకుల షెడ్లను నిర్మించారని, అటవీ శాఖ అధికారులు బుధవారం రాత్రి సమయంలో జెసిబి సహాయంతో రేకుల షెడ్లను తొలగించారు. ఆలయం వద్ద సుమారు 70 షెడ్లలనూ నిర్మించి కల్లు, తినుబండారాలు, దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ భూమిలో నిర్మించిన రేకుల షెడ్లను తొలగించాలని సంబంధిత అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిన రేకుల షెడ్ల యజమానులు తొలగించకపోవడంతో అటవీ శాఖ అధికారులు రాత్రి 12 గంటల సమయంలో జెసిబిల సహాయంతో షెడ్లను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది,

జీవన ఉపాధి కోసమే ఆలయం వద్ద రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకున్నామని షేర్ ఖాన్ పల్లి గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని సర్వే నెంబర్ 99 లో అటవీ భూమి కాకుండా గ్రామానికి చెందిన ప్రభుత్వం భూమి కూడా ఉందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు రాత్రి సమయంలో వచ్చి షెడ్లను కూల్చడంతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటవీ రెవెన్యూ శాఖ అధికారులు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి సర్వే నిర్వహించాలని కోరారు. జీవన ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్లను తొలగించడం దారుణమని అన్నారు.


Similar News