సీజింగ్ వాహనాలలో చెలరేగిన మంటలు… 4 ఆటోలు, ఒక కారు దగ్ధం

సీజింగ్ వాహనాలలో మంటలు చెలరేగి నాలుగు ఆటోలతో పాటు ఓ కారు దగ్ధమైన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో గురువారం చోటుచేసుకుంది.

Update: 2025-01-09 12:20 GMT

దిశ, నర్సాపూర్ : సీజింగ్ వాహనాలలో మంటలు చెలరేగి నాలుగు ఆటోలతో పాటు ఓ కారు దగ్ధమైన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన వాహనాలను గతంలో పార్క్ చేశారు. సీజ్ చేసిన వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 4 టాటా ఏసీ ఆటోలతో పాటు ఒక కారు దగ్ధమయ్యాయి. గమనించిన ఆర్టీసీ డిపో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మంటలు గమనించిన సిబ్బంది పక్కనే గల ఇతర బస్సులను దూరంగా తీసుకెళ్లి పార్క్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆర్టీసీ సిబ్బంది భావించారు.


Similar News