మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బెజ్జంకి తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు.
దిశ, బెజ్జంకి : బెజ్జంకి తెలంగాణ మోడల్ స్కూల్ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సంగీత తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లకు, 7 నుంచి 10 తరగతిలో ప్రవేశాలకు జనవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఏప్రిల్ 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మండల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు అవకాశం సద్వినియోగ పరచుకోవాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగీత సూచించారు.