అంతర్ రాష్ట్ర క్రిమినల్ అరెస్ట్..

గోవా నుంచి హైదరాబాద్ తో పాటు మెదక్, సంగారెడ్డి ఇతర రాష్ట్రాలకు మద్యం అక్రమంగా సరఫరా చేసే నొటోరియల్ క్రిమినల్, పీడీ యాక్ట్ నిందితుడు ఆఫీస్ ఖాన్ ను జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2025-01-09 15:25 GMT

దిశ, సంగారెడ్డి : గోవా నుంచి హైదరాబాద్ తో పాటు మెదక్, సంగారెడ్డి ఇతర రాష్ట్రాలకు మద్యం అక్రమంగా సరఫరా చేసే నొటోరియల్ క్రిమినల్, పీడీ యాక్ట్ నిందితుడు ఆఫీస్ ఖాన్ ను జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కి చెందిన ఆఫీస్ ఖాన్ చాలా కాలంగా గోవా నుంచి పలు ప్రాంతాలకు అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఉన్న కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఐదు సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఆఫీస్ ఖాన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలహాసన్ రెడ్డి మెదక్ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ కి ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.

ఈ టీం గోవాకు వెళ్లి గోవా పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్ చేసి జహీరాబాద్ కు తీసుకువచ్చారు. జహీరాబాద్ తో పాటు శంషాబాద్ చేవెళ్ల కుత్బుల్లాపూర్ ఇతర రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. 2016 సంవత్సరంలో నాలుగు లోడ్ ల మద్యాన్ని అక్రమంగా తెలంగాణకు సరఫరా చేస్తున్న సమయంలో మద్యాన్ని సీజ్ చేసి పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఐదేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నొటోరియల్ క్రిమినల్ ని పట్టుకొని అరెస్టు చేయడం పట్ల ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి అభినందించారు.


Similar News