కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు.. పోటా పోటీగా ఒకే పార్టీలో నిరసనలు

కాంగ్రెస్ పార్టీలో గుట్టుగా ఉన్న విభేదాలు రెచ్చకెక్కుతున్నాయి. ఈసారైనా మెదక్ లో హస్తం హవా సాగాలని ఓ వైపు కార్యకర్తలు పట్టుదలతో ఉంటే.. నేతల మధ్య ఐక్యత లేక విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ‘నువ్వో దారి..

Update: 2023-05-19 05:06 GMT

కాంగ్రెస్ పార్టీలో గుట్టుగా ఉన్న విభేదాలు రెచ్చకెక్కుతున్నాయి. ఈసారైనా మెదక్ లో హస్తం హవా సాగాలని ఓ వైపు కార్యకర్తలు పట్టుదలతో ఉంటే.. నేతల మధ్య ఐక్యత లేక విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే ‘నువ్వో దారి.. నేను మరో దారి’ అంటూ సాగిన నేతలు డీసీసీ అధ్యక్షుడు రెవెన్యూ డివిజన్ కోసం.. ఆందోళన చేస్తే.. మరికొంత మంది అదే పార్టీకి చెందిన నేతలు కౌలు రైతుల కోసం వేరు వేరు గా ఆందోళనలు నిర్వహించి వర్గవిబేధాలకు తెరలేపారు. ఎవరి వైపు వెళ్లాలో తెలియక గందరగోళం పరిస్థితి మెదక్​ కాంగ్రెస్​ నేతల్లో నెలకొంది.

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టున్న జిల్లా.. మెదక్ నియోజకవర్గం లో మాత్రం స్వర్గీయ కరణం రాంచందర్ రావు లాంటి బలమైన నేత ఉండడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అవకాశాలు రాలేదు.. పట్లోళ్ళ నారాయణ రెడ్డి దాదాపు 30 ఏళ్ల క్రితం చేతి గుర్తు విజయం సాధించింది.. కానీ ఆ తరవాత కరణం రామచందర్ రావు కే మెదక్ ప్రజలు పట్టం కట్టారు.. ఆయన మృతి చెందిన తరవాత జరిగిన ఎన్నికల్లో కరణం రామచందర్ రావు బార్య ఉమాదేవి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.. ఆ తరవాత నారాయణ రెడ్డి కుమారుడు పట్లోళ్ల శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేత పట్టినా ఆయనకు కాంగ్రెస్ పార్టీ కలిసి రాలేదు.. 2004 జరిగిన సాధారణ ఎన్నికల్లో శశిధర్ రెడ్డి కి అవకాశం ఉన్న కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో పొత్తు కారణంగా మెదక్ సీటు ను వైపియర్ కు ఇచ్చారు.. కానీ అప్పటి ఎన్నికల్లో శశిధర్ రెడ్డి జనతా పార్టీ గుర్తు పై పోటీ చేసి విజయం సాధించారు.. ఆ తరవాత మెదక్ నియోజక వర్గం లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బలమైన క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంది.. 2009 ఎన్నికలో పునర్విభజన కారణంగా రాష్ట్రం లో పలు నియోజక వర్గాలు మార్పులు చేర్పులు చేశారు.. అందులో భాగంగా రామాయం పేట నియోజక వర్గం ను మెదక్ నియోజక వర్గం లో విలీనం చేశారు..అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్న టిడిపి నేత మైనం పల్లి హన్మంత్ రావు కు టి అర్ ఎస్, టీడీపీ పొత్తులో మెదక్ సీటు కేటాయించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డి ఓటమి చెందారు.. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మరో సారి రావడం వల్ల శశిధర్ రెడ్డి అనధికారిక ఎమ్మెల్యే గా కొనసాగారు.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను బలంగా మార్చేందుకు కృషి చేశారు.. ఆ తరవాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మెదక్ ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయ శాంతి, 2019 ఎన్నికలో ఉపేందర్ రెడ్డి లు ఒడిన విషయం తెలిసిందే.

ముప్పై ఏళ్లుగా హస్తానికి దక్కని గెలుపు

మెదక్ నియోజకవర్గం నుంచి పట్లోల్ల నారాయణ రెడ్డి చేతి గుర్తు పై విజయం సాధించారు.. కానీ తరవాత జరిగిన ఎన్నికల్లో నారాయణ రెడ్డి ఓడిపోయారు.. ఆ తరవాత మెదక్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో చేతి గుర్తు పై ఆ పార్టీ అభ్యర్థులు గెలవలేదు.. 2004 ఎన్నికల్లో పొత్తు కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలపలేదు. కాని ప్రతి ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపు ఎండ మవిగానే మారుతుంది.. ఇందుకు ప్రధాన కారణం పార్టీలో ఐక్యత లేకపోవడమే.. టిక్కెట్ ఆశించిన వారికి నిరాశ ఎదురైతే వారు పార్టీ అభ్యర్థి గెలుపు పట్ల పట్టించుకోక పోవడం వల్ల ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో విజయ శాంతి, ఉపేందర్ రెడ్డి విషయం లో సైతం జరగడం వల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒడిపోయారన్న ప్రచారం ఉంది.

మళ్ళీ అదే బాటలో ప్రస్తుత నేతలు..

కాంగ్రెస్ పార్టీ కి మెదక్ నియోజక వర్గం లో బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని ప్రత్యార్థి పార్టీ నేతలు కూడా ఒప్పుకుంటారు. రాష్ట్ర ఆవిర్భావం తరవాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు 40 వేలకు పైగా ఓట్లు సాధించారు. అందులో చివరి క్షణం లో టిక్కెట్ పొందిన ఉపేందర్ రెడ్డి అన్ని గ్రామాల్లో ప్రచారం చేయకున్నా ఓట్లు ఓహించని విధంగా ఓట్లు వచ్చాయి.. ఇందుకు ప్రధాన కారణం చెక్కు చేశారని క్యాడర్, సాంప్రదాయ ఓటు బ్యాంక్. కాని విజయానికి కావాల్సిన ఓట్లు రాబట్టే నేతనే లేదన్నది కార్యకర్తల వాదన.. మూడు పర్యాయాలు గా కాంగ్రెస్ అభ్యర్థులు మారుతూ వస్తున్నారు.. శశిధర్ రెడ్డి, విజయ్ శాంతి, ఉపేందర్ రెడ్డి ఇలా ఎన్నికలకు ఒక్కో అభ్యర్థి మారడం కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి మరో కారణం గా పలువురు వాపోతున్నారు.

ఎవరికి వారే అయితే గెలుపు సాధించేది ఎలా..?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గ విభేదాలు బహిరంగ వినిపిస్తున్నారు. ఇప్పటికే బలమైన నేత లేదన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో వర్గాలుగా చేస్తున్న కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోసం భారీ బహిరంగ సభ ఈ నెల 17న నిర్వహించేందుకు పిలుపు నిచ్చాడు.. కానీ అదే రోజు మెదక్ టిక్కెట్ ఆశిస్తున్న మ్యాడం బాల కృష్ణ, సుప్రభాత రావు తో పాటు మరి కొంత మంది నేతలతో కౌలు రైతుల కోసం మెదక్ కలెక్టరేట్ వద్ద ధర్నా, ర్యాలీ నిర్వహించారు. ఒకే నియోజక వర్గంలో ఒకే పార్టీకి చెందిన నేతలు వేరు వేరు ఆందోళనలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.. ఇటీవల కర్ణాటక ఫలితాలు వెలువడిన తరవాత మెదక్ జిల్లా కేంద్రంలో సంబరాలు కూడా వేరువేరుగా నిర్వహించడం పై పలువురు చర్చించుకున్నారు. అసలే మెదక్ నియోజక వర్గంలో హస్తం కు అంత కలిసి రావడం లేదన్న ప్రచారం ఉంది.. మారో అరు మాసాల్లో ఎన్నికలు జరిగే సమయంలో ఇలా ఎవరి దారిలో వారు వెళితే ప్రజల్లో ఎలా ఎలాంటి సంకేతాలు వెళతాయి అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది.. ఇది అన్ని పార్టీల్లో వర్గ పోరు ఉన్న ఇలా పోటాపోటీగా చేసే కార్యక్రమాలు, ఆందోళన పైనే అంత చర్చిస్తున్నారు. ఇప్పుడే ఇలా వ్యవహరిస్తే ఎన్నికల్లో వీరి మధ్య ఎలా సయోధ్య కుదురుతుంది.. జిల్లా అధ్యక్షుడికే వ్యతిరేకంగా ఉంటే పరిస్థితి ఏమిటన్న కలవరం కార్యకర్తల్లో కలిగిస్తుంది.

Tags:    

Similar News