ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంత లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
దిశ, దుబ్బాక: ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంత లభిస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. దుబ్బాక మండలం పెద్దచీకోడులో శ్రీ పెద్దమ్మ దేవాలయంలో జరిగే నాల్గవ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కు ఎంపీ శాలువాతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు.
ఎమ్మెల్సీ తో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, హిందూ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా గ్రామాల్లో ఆలయ వార్షికోత్సవాలు నిర్వహించడం హర్షనీయమన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. భక్తి భావాన్ని అలవర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు.
ఆలయంలో జరిగిన పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం అమ్మవారికి మహిళలు ఒడి బియ్యాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రోట్టే రాజమౌళి, గన్నె భూంరెడ్డి,బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, మండల అధ్యక్షుడు బానల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.