క్రిస్మస్ వేడుకల్లో Minister Harish Rao
అభివృద్ధి, సంక్షేమ పాలనే బీఆర్ఎస్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని
దిశ, సిద్దిపేట ప్రతినిధి: అభివృద్ధి, సంక్షేమ పాలనే బీఆర్ఎస్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రం సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక పార్ధనలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన మంత్రి హరీష్ రావు క్రైస్తవ ఫాస్టర్లకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారన్నారు. పేదలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి ఆత్మబంధువులని, పేదలకు సాయం చేయడమే బీఆర్ఎస్ ధ్యేయం అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రెండు రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం బీఆర్ఏస్ ప్రభుత్వమే అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారతదేశమన్నారు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీనిచ్చారు. సిద్ధిపేట నియోజక వర్గాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు సాయిరాం, చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read...