'ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం ఎన్నికల నిబంధనలు పాటించాలి'

Update: 2023-10-10 15:06 GMT

దిశ, మెదక్ ప్రతినిధి: జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం ఎన్నికల నిబంధనలు పాటించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సాధారణ ఎన్నికలు–2023 నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951, సెక్షన్- 127 (ఏ) ప్రకారం.. జిల్లాలో ఉన్న ప్రింటర్‌లు అందరూ.. పాంప్లేట్స్, స్టిక్కర్లు, పోస్టర్స్, ప్లేక్సి ప్రింట్ చేసే వారు, అందరూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రింట్ చేసిన తర్వాత పబ్లిషర్ పేరు, ఎన్ని కాపీలు ప్రింట్ చేశారో వివరాలు స్పష్టంగా తెలియజేయాలి. వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలన్నారు.

ఎన్నికల అధికారుల తనిఖీ సమయంలో ప్రింటింగ్ కు సంబంధించిన అనుమతి పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. ఇతర ప్రాంతాలో ప్రింటింగ్ చేసి తరలిస్తే చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలలో పట్టుబడితే నిబంధనల ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద జమకడతారని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా కట్టవలసి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ యజమానులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News