అన్నపూర్ణాదేవిగా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి..
శ్రీ వర్గల్ విద్యాధరి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
దిశ, వర్గల్: వర్గల్ శ్రీ విద్యాధరి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వం చేస్తున్నాయి. రోజుకో అలంకారంతో భక్తులను కటాక్షిస్తున్న అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంతో దర్శనమిచ్చారు.అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. అసలు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఎప్పుడు ఆహారానికి ఇబ్బంది ఉండదని అమ్మను కొలిచిన వారి గృహం సౌభాగ్యం తో వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. వేదపండితులు గణపతి పూజ, కుంకుమార్చన, పుష్పార్చన, మంత్రం పుష్పాది కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం పూజలు, సప్తశతి పారాయణం, మూలమంత్ర హావనం నిర్వహించారు. అమ్మవారి దర్శించుకొని కట్న కానుకలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ , స్థానిక నాయకులు ఈ సందర్భంగా శ్రీ విద్యా సరస్వతి ఆలయ వేద పండితుల మధ్య చంద్రశేఖర సిద్ధాంతి వారికి తీర్థప్రసాదాలతో పాటు ఆశీర్వచనం ఇచ్చారు.