మా ఎమ్మెల్యే కేసీఆర్ ని వెతికిపెట్టండి

తెలంగాణ మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-06 12:50 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ గెలిచి పది నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో జాడలేడని, ఆయన ఆచూకీ తెలుసుకొని ప్రజలకు తెలపాలని ఫిర్యాదులో కోరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ నియోజకవర్గాల ప్రజల కాలికి ముల్లు దిగితే పంటితో తీస్తా అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.

    గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పనులు అసంపూర్తిగా మిగిలాయని తెలిపారు. పోలీసుల నుంచి సమాచారం రానిపక్షంలో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని నేరుగా సందర్శించి అసలు విషయం తెలుసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, గజ్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బయ్యారం మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు బాబా, నరసింహారెడ్డి, నల్ల శ్రీను, శేఖర్, నర్సింహులు, భువనగిరి రాజు, రతన్, స్వామి, నర్సింహులు, రవి, బాబా, తిరుపతి, రాజు, రాజు గౌడ్, భాస్కర్ , ఫణి కుమార్, కర్ణాకర్ రెడ్డి, కృపానందం, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. 

Tags:    

Similar News