సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్పా.. గవర్నర్ దిగిరార: మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్పా.. గవర్నర్ దిగిరార అంటూ మంత్రి హరీశ్ రావు గవర్నర్ తమిళిసై పై ఫైరయ్యారు.
దిశ, కొండపాక: సుప్రీం కోర్టు మెట్లెక్కితే తప్పా.. గవర్నర్ దిగిరార అంటూ మంత్రి హరీశ్ రావు గవర్నర్ తమిళిసై పై ఫైరయ్యారు. సోమవారం నాలుగు జిల్లాలకు తాగు నిరందించే ట్రయల్ రన్ లో భాగంగా కుకునూర్ పల్లి మండలం మంగోల్ లో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పరిశీలించిన అనంతరం మంత్రి హరీశ్ రావు విలేకరులతో మాట్లాడతురు. కేంద్రం స్వాతంత్ర్య వ్యవస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయకుండా ఏడు నెలలుగా పెండింగ్ లో పెట్టారని ధ్వజమేత్తారు. దీని వెనుక రాజకీయం ఏంటినే విషయం అందరూ గమనించాలన్నారు.
సుప్రీం కోర్టుకు వెళ్లి కేసులు వేస్తే తప్పా.. బిల్లులు ఆమోదించని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రగతిని బీజేపీ అడ్డుకునేందుకు అన్ని కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో తొలిసారిగా ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారని అన్నారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా అంటూ ప్రశ్నించారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, ఏడు నెలలు అపి ఇప్పుడు రాష్ట్రపతి పరిశీలనకు పంపండం ఎంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అని.. యూనివర్సిటీలకు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 1961 నుంచే అమల్లో ఉందన్నారు. ఇలా చేయడం గవర్నర్ కు సబబేనా అని ప్రశ్నించారు. ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తే.. ఇలా రాష్ట్ర పాలకులను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు. గవర్నర్ చర్యలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి సహకరించడం మాని అడ్డుపడడం సరైంది కాదని, సరైన సమయంలో తెలంగాణ సమాజం కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న మూడు బిల్లులను ఆమోదించడం పట్ల గవర్నర్ మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి: గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు: రెండు వారాలపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు