నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయంలో 2024 -2025 విద్యా సంవత్సరంగాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

Update: 2023-10-25 09:10 GMT

దిశ, వర్గల్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2024 -2025 విద్యా సంవత్సరం 9వ, ఇంటర్మీడియట్ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల ప్రవేశానికి గాను అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డి. రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ ప్రవేశ పరీక్షకు హాజర్యయ్యే అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ 01.05.2009 నుంచి 31.07.2011 తేదీల మధ్య జన్మించి ఉండాలని, ఇంటర్మీడియట్ ప్రవేశం కోరే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉమ్మడి మెదక్ జిల్లాలో చదువుతూ 01.06.2007 నుంచి 31.07.2009 తేదీల మధ్యలో జన్మించి ఉండాలని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏదేని ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలు ఉచితంగా www.navodaya.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో 31.10.2023 లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ రాజేందర్ కోరారు. అలాగే వారి తల్లిదండ్రుల నివాసం ఉమ్మడి జిల్లాలోనిదై ఉండాలని, రెండు తరగతుల ప్రవేశ పరీక్ష 10.02.2024 న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News