మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు : ఎమ్మెల్యే

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-27 12:26 GMT

దిశ, పటాన్ చెరు: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, హనుమంత్ రెడ్డి, సంజీవరెడ్డి, ఉపేందర్ రెడ్డి, సురేందర్ గౌడ్, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.

మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ శ్రేణుల నివాళి..


అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం కన్నుమూసిన దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘన నివాళి అర్పించారు. అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మన్మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల తోనే నేడు దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. పదేండ్లు యూపీఏ కూటమి తరపున ప్రధాన మంత్రిగా పని చేసి దేశానికి మరవలేని సేవలందించిన మచ్చ లేని నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆ మహనీయుడి మరణం దేశానికి తీరని లోటు అన్నారు.


Similar News