బంపర్ విరిగి బోల్తా కొట్టిన ట్రాక్టర్.. 17 మందికి గాయాలు..
మిల్లర్ ట్రాక్టర్ బోల్తా పడి 17 మంది గాయాలపాలైన ఘటన మాసాయిపేట మండలం గ్రామ శివారులో చోటు చేసుకుంది.
దిశ, తూప్రాన్ : మిల్లర్ ట్రాక్టర్ బోల్తా పడి 17 మంది గాయాలపాలైన ఘటన మాసాయిపేట మండలం గ్రామ శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే చిన్న శంకరం పేట మండలం సూరారం గ్రామంలో ఇంటి నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేయడానికి చేగుంట మండలం అంతగిరి పల్లి గ్రామంలో నుండి 17మంది కూలీలు మిల్లర్ ట్రాక్టర్ పై వెళ్తున్నారు. మార్గమధ్యలో ట్రాక్టర్ బంపర్ విరిగి బోల్తా ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.