అనుమతి లేకుండా టేకు చెట్లు నరికి వేసిన మాజీ సర్పంచ్

ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెంచిన పలు టేకు చెట్లను,

Update: 2024-12-28 14:09 GMT

దిశ, మద్దూరు: ధూల్మిట్ట మండలంలోని బైరాన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పెంచిన పలు టేకు చెట్లను, విద్యాశాఖ అధికారుల, అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా, స్థానిక మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ అక్రమంగా చెట్లను నరికి వేయడంతో, ఫారెస్ట్ బీట్ అధికారి రాముడు శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల అనుమతులు లేకుండా మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ మూడు టేకు చెట్లను నరికి వేయడం వల్ల అతనిపై కేసు నమోదు చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీనాంజనేయులు మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్ల తొలగింపు పై ఎలాంటి సమాచారం లేదని, మాజీ సర్పంచ్ బండి శ్రీనివాస్ కు టేకు చెట్ల తొలగింపు గురించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, చెట్ల తొలగింపుకు ఎలాంటి తీర్మానం చేయలేదని, పాఠశాల సెలవులు ఉన్నప్పుడు తనకు తెలియకుండా చెట్లను నరికి వేసినట్లు తెలిపారు.


Similar News