సీఎం రేవంత్ రెడ్డి దీ తిరోగమన పాలన : హరీష్ రావు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు

Update: 2025-03-16 12:08 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పై మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ని తిరోగమనం పట్టించారని అన్నారు. కరోనాలో సైతం రైతులకు రైతు బంధు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ది అన్నారు. ఎకరాకు రూ.15వేలు ఇస్తానని ఆశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి యాసంగి కి దోకా చేసి వానాకాలం రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకుందని ఎద్దేవ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనకు.. సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటల పాలనకు తేడాను ప్రజలను గమనిస్తున్నారని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి పగపట్టిన చందానా వ్యవహరిస్తూ వెటర్నరీ కాలేజీని కొడంగల్ కు తరలించాడని మండిపడ్డారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఆగిపోయిన పనులు తప్ప కొత్తగా మొదలు పెట్టిన పనులు ఒక్కటి లేదు అన్నారు. వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజ్ పనులు పూర్తి చేయకుండా పడవు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల కాలువలు తవ్వించక పోవడంతో చేర్యాల, దుబ్బాక నియోజక వర్గాల్లో పంటలు ఎండి పొయే దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండ గడతా అన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, కొండ సంపత్ రెడ్డి, రాధ కృష్ణ శర్మ, గుండు భూపేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయిన బీ ఆర్ ఎస్ పార్ నాయకుల కుటుంబాలకు ప్రమాద భీమా చెక్కులను మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు.


Similar News