చెక్ డ్యాంలతో చిలిపిచెడ్ మండల గ్రామాలు సస్యశ్యామలం : ఎమ్మెల్యే మదన్ రెడ్డి
చెక్ డ్యాంలతో చిలిపిచెడ్ మండల గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.
దిశ, చిలిపిచెడ్ : చెక్ డ్యాంలతో చిలిపిచెడ్ మండల గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో సాగునీటి దినోత్సవం సందర్భంగా చెక్ డ్యాంను ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి, కలెక్టర్ రాజర్శి షా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అజ్జమర్రి గ్రామ మహిళలు బోనాలు తీసి అధికారులకు నాయకులకు ఘనం స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ.. సింగూర్ నుంచి ఘనపూర్ వరకు అనకట్టలు ఉన్నాయన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 14 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నమ్మన్నారు. అన్ని చెరువులు నింపాలన్నదే తమ చిరకాల వాంఛ అని, ఇవన్నీ కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యాయన్నారు. త్వరలో చిలిపిచేడ్ కు కూడా చెక్ డ్యాం మంజూరు చేయిస్తామన్నారు. సోమక్కపేట, జగ్గంపేట, గౌతపూర్ లకు కూడా తొందర్లోనే నీటిని అందించే ప్రయత్నం చేస్తామన్నారు. సాగునీటి దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు అధికారులకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కలెక్టర్ రాజర్శి షా మాట్లాడుతూ.. పంప్ హౌస్ ల ద్వారా కాళేశ్వరం నీటిని వాడుతున్నామిని తెలిపారు.
బీబీసీ వాళ్లు కూడా కాళేశ్వరంపై డాక్యుమెంటరీ తయారు చేస్తున్నారన తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా వచ్చి కాళేశ్వరాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ప్రతి ఒక్క గ్రామం చెక్ డ్యాంల ద్వారా కాలువల ద్వారా సస్యశ్యామలం అయ్యాయన్నారు. అనంతరం మహిళా కమిషన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి ఒక్కో రోజు.. ఒక్కో ప్రగతి రూపంలో ప్రజలకు వెళ్లాలన్నారు. మనం చేసిన పనిని ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలనే ఆలోచనతోనే దశబ్ధి ఉత్సవాలను జరుపుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఎంపీపీ వినోదా దుర్గారెడ్డి, వైస్ ఎంసీపీ విశ్వంబర్ స్వామి, ఈఈ మల్లయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఎమ్మార్వో ముసదిక్, జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ. హత్నూరా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కూల్చారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీ శంకర్, కూల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతోష్, కౌడిపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామాగౌడ్, హత్నూర ఎంపీపీ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.