బట్ట కాల్చి మీదెయ్యడానికి అగ్గిపెట్టెలు బాగానే దోరుకున్నాయి!.. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ కౌంటర్

బట్టకాల్చి మీద వేయడానికి బీఆర్ఎస్ నాయకలకు అగ్గిపెట్టెలు బాగానే దొరుకుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

Update: 2024-06-09 10:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బట్టకాల్చి మీద వేయడానికి బీఆర్ఎస్ నాయకలకు అగ్గిపెట్టెలు బాగానే దొరుకుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఫ్లైయాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.100 కోట్ల స్కాం అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఒక్కలారీ చూపించి ఆధారాలతో సహ అన్ని చూపిస్తున్నా అంటావేంటి పాడి.. లారీ పక్కన నిలబడి లౌడ్ స్పీకర్ లాగా ఒర్లితే అయిపాయేనా?! అని విరుచుకుపడింది. ఒక ఎమ్మెల్యేగా ఆరోపణ చేసేటప్పుడు పక్కా ఆధారాలతో మాట్లాడలన్నా సోయి ఉండాలిగా? అని విమర్శలు చేసింది.

దమ్ముంటే అధికారిక వే బిల్లులు లేవని నిరూపించు..?, అంతేగాని లారీ పక్కన నలుగురిని వేసుకొని నిలబడి నక్రాలు చేస్తానంటే.. నమ్మేంత పిచ్చోళ్లు ఎవ్వరు లేరు ఇక్కడ..! అని ఆగ్రహం వ్యక్తి చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై బట్టకాల్చి మీదెయ్యనికే అగ్గిపెట్టెలు బాగానే దొరుకుతున్నాయ్ గాని.. అవి తిరిగి మీకు అంటుగల్ల జర భద్రం..! అని రాసుకొచ్చింది. కాగా బీఆర్ఎస్ పార్టీ శనివారం ఫ్లైయాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంను బట్టబయలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. దానికి సంబందించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.


Similar News