అధికార యంత్రాగంలో భారీ అవినీతి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్

రాష్ట్రంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని, ప్రతి చిన్న ప‌నికి కూడ లంచాలు ఇవ్వవల‌సిన ప‌రిస్థితి ఉందని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి మంగళవారం ఫిర్యాదు చేశారు.

Update: 2025-03-18 17:03 GMT
అధికార యంత్రాగంలో భారీ అవినీతి.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని, ప్రతి చిన్న ప‌నికి కూడ లంచాలు ఇవ్వవల‌సిన ప‌రిస్థితి ఉందని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ప్రభుత్వానికి మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ, మునిసిపాలిటీ, పోలీసు, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్‌, ఆబ్కారీ వంటి శాఖ‌ల‌లో అవినీతికి అదుపు లేకుండా పోతుందని ఫిర్యాదులో పేర్కోన్నారు. ఏసీబీ, విజిలెన్స్‌ల నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు, క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్న చాలామంది ఉద్యోగుల‌కు కోరుకున్న స్థానాలలోనే పోస్టింగులు అలాగే ప్రమోష‌న్లు కూడ ఇవ్వడం జ‌రుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ విధానంతో ఉద్యోగ‌స్థుల‌లో ఎన్ని అక్రమాల‌కు పాల్పడ్డా, లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ ఏమీ కాదు అన్న భావ‌న క‌లుగుతుందని అన్నారు. ఇటువంటి ఘటనలలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారి వివరాలు వెల్లడిస్తున్నట్లు పేర్కోన్నారు.

డీసీటీవో జి. శ్రీ‌నివాస్‌ 2013లో ఏసీబీ కేసు నమోదైందని గత 14 సంవత్సరాలుగా కేసు ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. అయినా డీసీటీవో జి. శ్రీ‌నివాస్‌ కోరిన విధంగా అసిస్టెంట్ కమీనర్ పదోన్నతి కోరకు అండర్ పాస్ చేసినట్లు తెలిపారు. మరో డీసీటీవో డి. శ్రీ‌నివాస్‌రెడ్డి పై 2018లో ఏసీబీ కేసు నమోదైందని 7 సంవత్సరాలుగా కేసు విచారణ పూర్తి కాలేదని పేర్కోన్నారు. కేసు పరిగణలోకి తీసుకోకుండా ఆయన ప్రమోషన్ పరిశీలిస్తున్నారని వివరించారు. కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ కె గీత అక్రమాలకు పాల్పడినట్లు 2017లో విజిలెన్ అధికారులు నమోదు చేసిన కేసు ఇంకా విచారణలో ఉందని పేర్కోన్నారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్ గా పదోన్నతి కోరకు పరిశీలను ఉన్నట్లు తెలిపారు. తీవ్ర నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఉద్యోగ‌స్థుల‌కు కావ‌ల‌సిన చోట పోస్టింగులు, ప్రమోష‌న్‌లు ఇవ్వడం జ‌రుగుతుందని ఆరోపించారు. మూడు కేసులలో సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు పేర్కోన్నారు.


Similar News