CM కేసీఆర్ పని ఖతం.. నెక్ట్స్ కాంగ్రెస్‌దే అధికారం: మానిక్‌రావు థాక్రే
కేసీఆర్ పని ఖతమైనట్టేనని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్‌రావు థాక్రే పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ పని ఖతమైనట్టేనని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ మానిక్‌రావు థాక్రే పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. 9 ఏళ్లల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు తీవ్ర నష్టాన్ని చేకూర్చిందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఆశలను నెరవేర్చలేదన్నారు. దీంతో యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రియాంక గాంధీ అందరిలో భరోసా నింపేందుకు వస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ఆధ్వర్యంలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ, కేసీఆర్‌లు నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలమైనట్లు విమర్శించారు. ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే.. కేసీఆర్దాన్ని తన అవసరానికి అనువుగా మార్చుకొని లబ్ధి చేకూర్చుకున్నట్లు వెల్లడించారు. గతంలో 25 లక్షలు నిరుద్యోగులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. అక్టోబర్‌లో షెడ్యూల్ వస్తే.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
గతంలో బీఆర్ఎస్ప్రభుత్వం 80 వేల39 పోస్టులు భర్తీ చేసి, 11 వేల కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిందని, కానీ ఈ ఏడాదిలో ఒక్కటి కూడా చెయ్యలేదన్నారు. పైగా పేపర్లీకేజ్లు నిత్యకృత్యమయ్యాయని స్పష్టం చేశారు. కేసీఆర్ అసమర్ధత, అవినీతి వల్లే పేపర్‌లీకేజీ అయిందన్నారు. రాష్ట్రంలో 503 గ్రూప్ -1 పోస్టులకు ఏకంగా మూడున్నర లక్షల మంది, 17 వేల పోలీస్ఉద్యోగాలకు 12 లక్షల మంది అప్లై చేసుకున్న తీరును పరిశీలిస్తేనే నిరుద్యోగ తీవ్రత అర్థం అవుతుందన్నారు.