మరో కుట్రకు తెరలేపిన మహిపాల్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా కలెక్టర్, సీపీపైనే!

కరీంనగర్‌లో మహిపాల్ గ్యాంగ్ మరో కుట్రకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అరాచకాలకు పాల్పడిన మహిపాల్ గ్యాంగ్ ఇప్పుడు..

Update: 2024-02-24 09:58 GMT

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో మహిపాల్ గ్యాంగ్ మరో కుట్రకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా అరాచకాలకు పాల్పడిన మహిపాల్ గ్యాంగ్ ఇప్పుడు.. వాటికి మూల్యం చెల్లిస్తూ కటకటాల పాలవుతుంటే తట్టుకోలేక మరో కుట్రకు తెరలేపారు. ఏకంగా కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ల పైనే కుట్ర చేశారు. కలెక్టర్, సీపీలను ఎన్నికల కమిషన్ బదిలీ చేసిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పాటు ‘మహిపాల్ అన్న రిటర్న్ గిఫ్ట్’ ఇస్తాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియా వేదిక జరుగుతున్న ప్రచారంపై పోలీసులు నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరు పోస్టు చేస్తున్నారు.. ఎవరెవరు వైరల్ చేస్తున్నారు.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సదరు గ్యాంగ్‌లపై చర్యలకు సిద్ధం అవుతున్నారు.

Tags:    

Similar News