Formula-E Car Race: కేటీఆర్ కేసుపై స్పందించిన అద్దంకి దయాకర్
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR)పై నమోదైన కేసుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్పందించారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(KTR)పై నమోదైన కేసుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ అనుమతి లేకుండానే కేటీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. కేటీఆర్ స్వయంగా నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేటీఆర్ విచారణకు సహకరించాలని అన్నారు.
ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండానే రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఇందులో కేటీఆర్‌తో పాటు అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, చీఫ్ ఇంజినీర్‌పైనా కేసు నమోదు చేశారు.