కేసీఆర్‌కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‌కు మహారాష్ట్ర కీలక నేత రాజీనామా

బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రకు చెందిన మరో నేత గుడ్ బై చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి షాక్ ఇచ్చారు.

Update: 2024-03-19 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రకు చెందిన మరో నేత గుడ్ బై చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు మంగళవారం బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు, పార్టీ ప్రధానకార్యదర్శి మానిక్ రావు కదం పంపారు. బీఆర్ఎస్‌కు రాజీనామా అనంతరం ఆయన ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత అజిత్ పవర్ ఎన్సీపీ కండువా కప్పడంతో పాటు పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. బీఆర్ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీ వీడటంతో పార్టీలో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు కొందరు నేతలు ఎన్సీపీలో చేరారు. ఇప్పటికే మహారాష్ట్ర బీడ్ జిల్లా ఇన్ చార్జీగా పనిచేస్తున్న దిలీప్ గోరే గత నెల18న బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్లారిటీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియోను పార్టీ అధినేత కేసీఆర్ పంపారు. అయినా వారికి రిప్లై ఇవ్వలేదని సమాచారం.

అదే విధంగా పదిరోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కోఆర్డినేటర్లు హాజరయ్యారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిస్థితులు, రాజకీయ భవిష్యత్‌పై సుధీర్ఘంగా చర్చించాచి లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తుందో.. లేదో తేల్చాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ వారికి స్పష్టత ఇవ్వలేదని సమాచారం. దీంతో వారంతా రాజీనామా చేసి ఇతర పార్టీల్లోనే చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే పార్టీ మహారాష్ట్రాలో ఖాళీ అవుతుందని, తెలంగాణకే ఇక గులాబీ పరిమితం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

Tags:    

Similar News