CM Revanth Reddy : ఢిల్లీ పర్యటన వెనుక కారణం ఇదే : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేటి సాయంత్రం ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేటి సాయంత్రం ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే తమ పర్యటన వెనుక గల కారణాలను బయట పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. లోక సభ స్పీకర్ ఓం బిర్లా(Om Birla) కూతురు వివాహం సోమవారం సాయంత్రం జరగనుందని, ఆ పెళ్ళికి హాజరవడానికి మాత్రమే ఢిల్లీ వెళ్తున్నామని తెలియజేశారు. రేపు ఉదయం పలువురు కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలను కలిసి తెలంగాణకు గతంలోనే రావాల్సిన నిధులు, అనుమతుల గురించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించమని కోరనున్నటు తెలిపారు. అనంతరం అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. మెట్రో రెండో దశ, నూతన విమానశ్రయాలకు అనుమతులు వంటివి చర్చించనున్నామని సీఎం పేర్కొన్నారు. తమ ఢిల్లీ పర్యటన గల కారణాలు ఇంతేనని.. మీడియాలో వస్తున్నట్టు మంత్రివర్గ విస్తరణ కోసమో మరో దానికో కోసమో కాదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం వందసార్లు అయినా అడగటానికి ఢిల్లీ వెళ్తామని.. వేరేవాళ్ళ లాగ మోడీ కాళ్ళు పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకునేందుకో వెళ్ళడం లేదని రేవంత్ రెడ్డి మండి పడ్డారు.