బీఆర్ఎస్ ప్రభుత్వం లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు : లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లోని రాజాపూర్ మండలంలో పలు గ్రామాలు అయినా రంగారెడ్డి గూడా, గుండ్ల పొట్లపల్లి, బీబీనగర్, నాన్ చెరువు తండా, ఇద్గాన్ పల్లి, మల్లేపల్లి, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, గ్రామాలలో జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Update: 2023-11-16 15:20 GMT

దిశ: రాజాపూర్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లోని రాజాపూర్ మండలంలో పలు గ్రామాలు అయినా రంగారెడ్డి గూడా, గుండ్ల పొట్లపల్లి, బీబీనగర్, నాన్ చెరువు తండా, ఇద్గాన్ పల్లి, మల్లేపల్లి, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, గ్రామాలలో జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డి గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగా జరుగుతుందా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు సరఫరా సక్రమంగా జరుగుతుందా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత తొమ్మిది ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

డ్రైనేజీలు, సిసి రోడ్ 100% పూర్తి చేశామని గ్రామాలలో మంచినీటి కష్టాలు తొలగించామని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్లల వివాహాలకు కేసీఆర్ తోడుగా నిలిచారని గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక నూతనంగా ప్రవేశపెట్టిన సౌభాగ్య లక్ష్మి పథకం ప్రతి పౌరుడికి 5 లక్షల ఉచిత బీమా విడతల వారీగా 5000 వరకు పెన్షన్ పెంపు, 400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు పెంపు వంటి పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అంటేనే కరెంటు కోతలు, నీటి కష్టాలు, రైతుల ఆత్మహత్యలు, అభివృద్ధి నిరోధకులు అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇస్తే రాజ భోగాలు అనుభవించెవారె తప్ప అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని అభివృద్ధి నిరోధకులు గా మిగిలిపోయారని అలాంటి వారు అధికార దాహంతో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను గందరగోళం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని ఓటు వేసే ముందు నిత్యం తమ కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని చూసి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని మంచి చేస్తున్న ప్రభుత్వాన్నే మళ్ళీ కొనసాగించేందుకు కారు గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి మోహన్ నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, యువనేత అభిమన్యు రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సింలు, మూడ డైరెక్టర్ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ శేఖర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు బుచ్చిరెడ్డి , రాఘవేందర్ రెడ్డి, గోవింద నాయక్, పెంటయ్య, గంగాధర్ గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేష్ గౌడ్, తిరుపతయ్య, వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News