‘దిశ’ కథనానికి అనూహ్య స్పందన.. కేజీబీవీ ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ సస్పెన్షన్
నవాబుపేట కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న
దిశ,నవాబుపేట : నవాబుపేట కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న కుమారి జల్సా పూరీలు చేస్తుండగా వేడి నూనె పడి కాలికి, చేతికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన గురించి దిశ దినపత్రిక బుధవారం రాత్రి ప్రచురించిన వార్తకు అనూహ్య స్పందన లభించింది. వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి వెంటనే నవాబుపేట తహశీల్దార్ శ్రీనివాసులును విచారణకు ఆదేశించారు.
కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ శ్రీనివాసులు సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కేజీబీవీ ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి ప్రశాంతి నిర్లక్ష్యం పై కలెక్టర్ కు నివేదిక సమర్పించారు. తహశీల్దార్ నివేదికననుసరించి కుమారి జల్సా అనే విద్యార్థిని పూరిలు చేస్తూ వేడి నూనెలో పడి చేతులకు గాయం జరగడానికి ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ ప్రశాంతి కారణంగా భావిస్తూ సీసీఎ 1991 నిబంధనల ప్రకారం ఆమెను విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లించాలని, విచారణ పూర్తి అయ్యే వరకు హెడ్ క్వార్టర్ వదిలి ఎక్కడికి వెళ్లరాదని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.