పసిడి షాపుల్లో దోపిడీ...నకిలీ కాంటాలతో తూకంలో మోసాలు...!
నిరుపేదల నుంచి ధనవంతుల వరకు జీవన కాలక్రమేణా నాలుగు పైసలు
దిశ,వనపర్తి టౌన్: నిరుపేదల నుంచి ధనవంతుల వరకు జీవన కాలక్రమేణా నాలుగు పైసలు వెలిగితే మొదటగా గుర్తొచ్చేది బంగారు మీద ఇన్వెస్ట్ మెంట్ చేయడం. ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు, మనకు నమ్మిన వ్యాపారస్తుడుతో మనం అవసరాన్ని బంగారు కుంటుంటాం. ఈ మేరకు అదును చూసుకొని పసిడి వ్యాపారాలు చేస్తున్న నిలువు దోపిడీకి కొనుగోలుదారులు బలివుతున్నారు. ఏ ఇంట్లో అయిన చిన్న కార్యం నుంచి మొదలుకొని పెళ్లి పేరంటాల వరకు బంగారు వన్ గ్రామ్ నుంచి తులాలలో కొంటుంటాం. బంగారు షాపుల నిర్వాహకులకు మాత్రం ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
వారు చేస్తున్న మోసాలు అంత ఇంతా కాదండోయ్... నకిలీ కాంటాలతో తూకాలతో మోసాలు చేయడం, రాళ్లను తూకంలో పెట్టి విక్రయించడం, తరుగు పేరిట కొనుగోలుదారులను నిలువుగా దగా చేస్తున్నారు. పసిడి షాపులలో జరుగుతున్న అవకతవకలపై తూనికలు కొలతల అధికారులు మాత్రం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని బాహటంగా వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తూనికలు కొలతల అధికారులు తనిఖీలు చేస్తే పసిడిలో జరుగుతున్న అవకతవకలు బయటకు పడే అవకాశాలు కోకొల్లలే అని చెప్పాలి. పసిడి వ్యాపారుల మోసాలకు వినియోగదారులు నిలువు దోపిడికి గురవుతున్న పరిస్థితి నెలకొంది.
పసిడి కొలతల్లో తేడాలు...!!
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నిర్దేశించిన దాని ప్రకారం బంగారు ఆభరణాలను క్రయవిక్రయాలు ఉపయోగించే మిషన్లలో వారు సూచించిన మిషన్లే నిర్ధారించి వినియోగించాలని తెలిసి చెప్పారు. బిఐఎస్ 2016 యాక్ట్ ప్రకారం సమస్య సూచించిన మిషన్లలో బంగారు ఆభరణాలను నిర్ధారణ చేయడం శాస్త్రీయమైన విధానం. కానీ వారు సూచించిన మిషన్లు లక్షల్లో ఉండడంతో పసిడి వ్యాపారస్తులు థర్డ్ పార్టీ నకిలీ మిషన్లను వినియోగిస్తున్నారు. బీరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ నియమాలను ఉల్లంఘిస్తూ వారు వినియోగిస్తున్న మిషన్లను ఏ ఆభరణం వేసిన అందులో బంగారం, రాగి, వెండి, కాఫర్ , క్యాండీమియం వంటి లోహాలు ఎంత క్యారెట్ లో ఉంటుందో ఇట్టే తెలియజేస్తుంది. పసిడి వ్యాపారులు వాడుతున్న మిషన్ లో చాలా తేడాలు ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం అయితే ఏడు శాతం మిశ్రమంతో చేస్తారు. ఒక శాతం అటు ఇటు మినహా 92 శాతం బంగారు మాత్రమే ఉంటుంది. 20 క్యారెట్ల బంగారంతో చేస్తే 14 శాతం మిశ్రమం, 18 క్యారెట్ల బంగారం అయితే 24 శాతం మిశ్రమం, చివరికి 16 క్యారెట్ల బంగారం అయితే 34% మిశ్రమంతో చేస్తారన్నది అత్యంత విశ్వసనీయ సమాచారం. పసిడి షాపుల్లో జరుగుతున్న అవకతవకలపై బంగారు బైపాస్తులు అసోసియేషన్ ప్రతి విషయాలను చాలా గోప్యంగా పెడుతూ ""కీ"" రోల్ గా వ్యవహరిస్తుంది.
ఎంత బంగారం కొన్నా బుక్క చిట్టి తోనే సరి..!!
ప్రజల్లో ఉండే నమ్మకాలను పసిడి వ్యాపారుల పాలిట వరమైంది. నగలపై, వజ్రాలపై, వివిధ రకాల డిజైన్ల ఆభరణాలపై కొనుగోలుదారులకు అవగాహన లేకపోవడంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మేకింగ్ చార్జెస్, వేస్టేజ్ చార్జెస్ , తరుగు పేరిట ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్లు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ అధికారులు గతంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన మోసాలు తెలిసి చెప్పారు. అయిన జిల్లాలో పసిడి షాపుల్లో జరుగుతున్న అవకతవకలపై తూనికలు కొలతల అధికారులు తనిఖీలు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్న ధోరణి అవలంబించడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతుంది. సీజన్ వచ్చిందంటే చాలు 3 కోట్ల నుంచి 8 కోట్ల వరకు క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. అయిన అధికారుల పర్యవేక్షణ లోపంతో పసిడి వ్యాపారులు జీరో దందా యదేచ్చగా నడిపిస్తున్నారు. జిఎస్టి, ఇన్కమ్ టాక్స్ , ట్రేడ్ లైసెన్స్, ఆభరణాలను కొలిచే మిషన్లను ఏడాదికి రెన్యువల్ చేయాలి. ఇలాంటి పసిడి వ్యాపారులకు ఎగ్గొడుతున్న అధికారులు పట్టించుకోకపోవడం కోసమెరుపు. ప్రభుత్వాదానికి భారీగా గండిపడుతున్న ఉన్నత అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంతో పాటు వినియోగదారులకు జరుగుతున్న మోసాలను అరికట్టవచ్చని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.