శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి ఒకరి పరిస్థితి విషమం
నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్డుపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్లు ఈగలపెంట ఎస్సై వీరమల్లు ఆదివారం ఉదయం దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు లోని బొల్లారం ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక కారులో శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఘాట్ రోడ్డుపై కొటవర్లపల్లి దోమలపెంట గ్రామాల మధ్య కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు బాగా మద్యం సేవించారని తద్వారా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని ఎస్సై వివరించారు. ఆదివారం ఉదయం ఇద్దరి మృతదేహాలు ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని మరొక్కరిని తరలించాల్సి ఉందని గాయపడ్డ మరో వ్యక్తిని శ్రీశైలం సున్నిపెంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తాగి వాహనం నడిపినందుకేనా..?
శ్రీశైలం దైవ దర్శనం కోసం హైదరాబాదును లోని బొల్లారం ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిన వారు మార్గమధ్యంలో రాత్రి మద్యం సేవించి వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది తాగి వాహనం నడపడం ద్వారానే అప్పటివరకు ప్రాణాలతో ఉన్న స్నేహితులు తాగి వాహనం నడపడం ద్వారానే నలుగురిలో ముగ్గురు మృతి చెందిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది.ఈ సమయంలో శ్రీశైలం వెళ్లకపోతే మంచిది.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్న నాగార్జునసాగర్కు నీటిని వదులుతున్న నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రకృతి అందాలను తిలకించేందుకు వేలాది వాహనాలు శ్రీశైలం వెళుతున్నాయి. ఈ క్రమంలో గత రెండు రోజుల నుండి హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు పలుచోట్ల వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఘాట్ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు భక్తులు పర్యాటక ప్రేమికులు ప్రస్తుత సమయంలో శ్రీశైలం వెళ్లకపోతే చాలా మంచిదని పోలీసులు అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు వచ్చినా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం ప్రమాదాలు 10 కిలోమీటర్లు పది గంటల సమయం పాటు నిరీక్షణ చేయాల్సి వస్తుందని కావున ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.