ప్రజాసేవకు ఎప్పుడు విరమణ ఉండదు.. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ

ప్రజానాయకుడి పదవులకు విరమణ ఉండొచ్చు నేమో కానీ ప్రజాసేవకు ఉండరాదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కూడు వంశీకృష్ణ అన్నారు.

Update: 2024-07-04 10:11 GMT

దిశ, చారకొండ : ప్రజానాయకుడి పదవులకు విరమణ ఉండొచ్చు నేమో కానీ ప్రజాసేవకు ఉండరాదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కూడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రం రైతువేదికలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య ప్రత్యేక సమావేశం ఎంపీపీ గుండె నిర్మల విజేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ చిక్కూడు వంశీకృష్ణ హాజరై మాట్లాడారు. నాయకుడు ఈర్ష్య ద్వేషం లేకుండా రాజకీయలకు అతీతంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. పదవి విరమణ సన్మానం పొందుతున్న ఎంపీపీ, ఎంపీటీసీలను ఉద్దేశిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని శుభాకాంక్షలు తెలిపారు.

రూ.29 కోట్ల మండల కార్యాలయ సముదాయానికి మంజూరు అయినట్లు, అందుకు కావలసిన ఐదు ఎకరాల భూమిని సేకరించాలని ఎమ్మార్వోను ఆయన ఆదేశించారు. దానితో పాటు మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి రూ.16 కోట్లు, బ్రిడ్జి నిర్మాణానికి రూ.20 కోట్లు ఆర్ అండ్ బీ అధికారులతో మాట్లాడి తొందరలో మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తనకు మొదటి సారిగా రాజకీయ భవిష్యత్తుని కల్పించన మండల ప్రజలకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని, గోకారం చెరువును తిరిగి పునః నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తామని జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు రూ.400 కోట్ల రూపాయలు దళిత బంధు పథకంతో దళితులకు తీసుకొచ్చిన ఘనత మండల ప్రజా ప్రతినిధులదని పీఏసీఎస్ చైర్మన్ జెల్ల గురువయ్య గౌడ్ అన్నారు.

ఎటువంటి సంఘటన లేకుండా ప్రజా సేవకు సహకరించిన ప్రజలకు, అధికారులకు కృతజ్ఞతలు అని ఎంపీపీ గుండె నిర్మల విజేందర్ గౌడ్ అన్నారు. అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలను ఎమ్మెల్యేతో పాటు మాజీ సర్పంచ్ లు, నాయకులు ఘనంగా సన్మానించారు. స్థానిక గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, స్థానిక మాజీ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ నకినమోని బక్కమ్మ ఎమ్మార్వో కె.సీ ప్రమీల, ఇతర ప్రభుత్వ అధికారులు, చార కొండ మాజీ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాల్ రాం గౌడ్, వివిధ పార్టీల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.


Similar News