జిల్లాకు 20 మీ సేవ కేంద్రాలు మంజూరు…

జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మీ-సేవ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటుకు తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు ఏ.పీ.డీ లను ఆదేశించారు.

Update: 2024-07-06 13:35 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్: జిల్లాలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మీ-సేవ కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటుకు తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు ఏ.పీ.డీ లను ఆదేశించారు. శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సీఈవో దివ్య హైదరాబాద్ నుంచి డీ.ఆర్.డీ.ఓ ల తో మీసేవ కేంద్రాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను వ్యాపార రంగాల్లో ప్రోత్సహించేందుకు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిర మహిళాశక్తి శ్రీ పథకం ద్వారా మీసేవ కేంద్రాలు మంజూరుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాకు 20 కేంద్రాలు మంజూరయ్యాయి. విద్య, అర్హత బట్టి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… గ్రామాలలో గవర్నమెంట్ లొకేషన్ లో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా సర్వే చేసి రిపోర్టు ఇవ్వవలసిందిగా ఏ.పీ.డీ లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈడియం శివ, తదితరులు పాల్గొన్నారు.


Similar News