కాకా సేవలు అమోఘం ఎందరికో స్ఫూర్తి

స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2024-10-05 10:25 GMT

దిశ, అచ్చంపేట : స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి జయంతిని అచ్చంపేట పట్టణంలో టీఎన్జీవో భవనంలో డివిజన్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై కాకా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాకా జయంతి &వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన తెలంగాణ తొలి మలిదశఉద్యమకారుడిగా,సింగరేణి బాంధవుడిగా, కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

కాకా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అన్నారు. హైదరాబాద్ నగరంలో ఎంతో మంది నిరుపేదలకు కూడు,గూడు ఆధారం లేని పేద ప్రజలందరికీ ఆ రోజుల్లోనే గుడిసెలు వేయించి వారికి నివాసం ఏర్పాటు చేసిన మహానేతన్నారు. ఆయనకు గుడిసెల వెంకటస్వామిగా ఈరోజు వరకు పేద ప్రజలు పిలుచుకుంటారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బాలస్వామి, కుంద మల్లికార్జున్, ఎనుపోతుల అనిల్, కిన్నెర పాండు, సిద్ధార్థ మహాదేవ్,  బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కట్ట గోపాల్ రెడ్డి, గాయకుడు మురళి, అవుట కోటి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


Similar News