నారాయణపేట కొత్త డీఈవో ఎవరో తెలుసా..?

నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారిగా డాక్టర్ యం గోవిందరాజులు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-11-28 14:34 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా విద్యాశాఖ అధికారిగా డాక్టర్ యం గోవిందరాజులు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.  నారాయణపేట డిఈఓ గా పనిచేసిన అబ్దుల్ ఘనిని మాగనూరు పాఠశాల ఫుడ్ పాయిజన్ కారణంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గోవిందరాజులు వచ్చారు. ముందుగా కలెక్టర్ సిక్త పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఈఓ డాక్టర్ యం గోవిందరాజులకు కార్యాలయ పర్యవేక్షకులు నరసింహారెడ్డి, సెక్టోరియల్ అధికారులు, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాలయ అధికారులు సిబ్బంది పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. కాగ ఈయన నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల డీఈవోగా పనిచేస్తూ బదిలీపై నారాయణపేట జిల్లాకు వచ్చారు.


Similar News